Thursday 14 May 2015

Impartial Judgement

Impartial Judgement

నిష్పక్ష తీర్పు
డానీ

కలియుగం కనుక ధర్మం ఒంటికాలి మీద సడుస్తోందట మధ్య హైదరాబాద్లోరోడ్దుదాటుతుంటే  కారుగుద్ది ఒంటికాలు కూడా కుంటిదైపోయిందనిచూసినవాళ్ళు చెపుతున్నారుఅయినా ధర్మం గురించి మహానగరాల్లోమాట్లాడుకోవడం  సమంజసం కాదుకనుక మనం ఇతర విషయాల వైపు మళ్ళితేబాగుంటుంది.

 మధ్యఆకలితో నకనకలాడిపోతున్న కుర్రాడొకడు ఆమీర్ పేట సెంటర్లో రోడ్దుపక్కపునుగులు తినిడబ్బులు ఇవ్వకుండా పారిపొయాడుసైబరాబాద్ ఒబేసిటీ రన్ లోపాల్గొని వస్తున్న  మెరికల్లాంటి కార్పోరేట్ కాలేజీ కుర్రాళ్ళు  నలుగురు అప్పుడేఅక్కడికి చేరారు.  వాళ్ళుబహు సాహసోపేతంగా పరుగులు తీసి పునుగులదొంగను పట్టుకునినాలుగు తన్నిఈడ్చుకువచ్చిపునుగుల బండివాడికిఅప్పచెప్పారు

అక్కడే  విచిత్రం జరిగిందిపునుగుల బండివాడు  పునుగుల దొంగను కసితీరాతంతాడనీ తరువాత,  తనివితీరా తిడతాడనీ,  అందరూ అనుకున్నారు.  కానీ,అతనా పని చెయ్యలేదుపైగా పునుగుల దొంగకు ఇంకో రెండు ప్లేట్లు పునుగులుఇచ్చిఆకలితీరా తినమన్నాడు.  ఐదేళ్ల క్రితం తను కూడా ఆకలితోనే మెదక్ జిల్లానుండి ఇక్కడికి వచ్చిఅలా ఆమిర్ పేటలో స్థిరపడ్డానన్నాడుపునుగుల దొంగఒప్పుకుంటే తన దగ్గర వంట అసిస్టెంటు అనబడేప్లేట్లు కడిగే ఉద్యోగం ఇస్తానన్నాడు. ప్రతిపాదన పునుగుల దొంగకు కూడా నచ్చిందివెంటనే కొలువులో చేరిపోయాడు.వాళ్ళిద్దరూ  గొడవని అలా శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నారు.
స్కాములుస్వాములూసానులు తప్ప మరోవార్త కవర్ చేయడానికి ఈమధ్యఅంతగా  అవకాశం దొరకని మీడియావాళ్ళు మొత్తం కట్టకట్టుకుని  పునుగుల దొంగమీద పడ్డారుపునుగుల బండివాడి ఔదార్యాన్ని వంద కెమేరాలతోరెండు వందలవిశ్లేషణలతో ప్రసారం చేశారు
ఉదయం సెషన్ కూ మధ్యాహ్నం సెషన్ కూ మధ్య లంచ్ సమయంలో పేషీ టివీలోహల్లో డాక్టర్’ ప్రోగ్రాం చూస్తున్న హైకోర్టు న్యాయమూర్తులవారు ఒకరి దృష్టి  బ్రేకింగ్న్యూస్ మీద పడిందిపునుగుల దొంగ కథనం విని వారు వెంటనే స్పందించారు.

ధర్మం  హైదరాబాద్ రోడ్ల మీద ఒంటికాలితో కుంటుతూ నడుస్తోందిగానీహైకోర్టుఆవరణలో అది నాలుగు కాళ్లతో సంచరిస్తోందిధర్మాన్ని ఎవరు ఉల్లంఘించినా సరేవారికి శిక్షపడాల్సిందేనని భావించిన సదరు న్యాయమూర్తులంవారుదొంగతనంచేసినందుకు పునుగుల దొంగ మీదాఒక దొంగకు ఆశ్రయం కల్పించినందుకుపునుగుల బండివాడి మీదా సూమోటోగా కేసులు నమోదు చేయాలని ఆమీర్ పేటపోలీసు స్టేషనుకు తాఖీదు పంపించారు

అలా మొదలైన  కేసు చాలా వేగంగా ముందుకు కదిలి,  హైకోర్టు ఫుల్ బెంచి ధర్మాసనం ముందు తీర్పు వరకు వచ్చేసిందితీర్పు చెప్పే ముందుధర్మాసనంలోనిన్యాయమూర్తులందరూ పునీతులవ్వాలనిన్నూఆత్మప్రక్షాళన చేసుకోవాలనిన్నూ,నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలనిన్నూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.  

" యొక్క పునుగుల వ్యాపారంలో మీలో ఎవరికైనా విధమైన ఆసక్తిగానీవుందా?" అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు.
"లేదుఅని ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు.
"మీలో ఎవరైనాగానీప్రైమరీ మార్కెట్లోగానీసెకండరీ మార్కెట్లోగానీ యొక్కపునుగుల బండిలో షేర్లు కొన్నారా?"
"లేదులేదు"
" పునుగుల బండివాడితోగానీ పునుగుల దొంగతోగానీమీకెవరికైనాబంధుత్వాలుగానీస్నేహాలుగానీరాగద్వేషాలుగానీ వున్నాయా?"
"లేదులేదులేదు".
"మీలో ఎవరైనా ఎప్పుడయినా అటుగా వెళుతూ ఆమీర్ పేట సెంటర్లో  యొక్కపునుగుల బండి దగ్గర ఆగిఏవైనా తినడంగానీతాగడంగానీ చేశారా?"
"లేదులేదులేదులేదు".

ధర్మాసనంలోని న్యాయమూర్తుల సమాధానాలతో సంతృప్తి  చెందిన ప్రధానన్యాయమూర్తులవారు,  వాళ్లను ఇక  తీర్పు చెప్పాల్సిందిగా కోరారు.
అప్పుడు  న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో పునుగుల బండివాడికీ,పునుగుల దొంగకూ చెరో ఆరేళ్ళ కఠినకారాగార శిక్షను విధించారు
 తరువాతహైకోర్టు ఆవరణలో ధర్మం దర్జాగా వెయ్యి కాళ్లతో సంచరించడంమొదలెట్టింది.

(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసంకాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగారికి అభినందనలతో)

హైదరాబాద్
11 - 12 - 2011 

NOT BEFORE ME - Danny Story

NOT BEFORE ME - Danny Story


"నాట్ బిఫోర్ మీ"
డానీ
గరటయ్యను నిందితుల బోనులో చూసి హైకోర్టు విస్తృత ధర్మాసనం కాస్సేపు కంపించింది. గరటయ్యకు ఘనమైన చరిత్రవుంది. పోలీసు రికార్డుల్లో అది ఇప్పటికీ భద్రంగావుంది. విజయవాడ రైల్వే యార్డులో పాత ఇనప ముక్కలు దొంగిలించాడని ముఫ్ఫయి యేళ్ల క్రితం అతని మీద ఆర్పీయఫ్ వాళ్ళు కేసు నమోదు చేశారు. పోలీసులు అతని మీద ఆ కేసు పెట్టకుండా వుండివుంటే, జడ్జిగారు అతనికి వారం రోజుల శిక్ష వేయకుండా వుండివుంటే, గరటయ్య ఇప్పటికీ రైల్వే యార్డుల్లో పాత ఇనపముక్కలు ఏరుకుంటూ బతుకు వెళ్ళబోసుకుంటూ వుండేవాడు. పోలీసులు కేసుపెట్టి, న్యాయస్థానం శిక్షవేసి, గరటయ్య జీవితాన్ని మార్చేశారు. ఆర్పీయఫ్ వాళ్ళు పట్టుకుని, రైల్వే కోర్టు బోనులో నిలబెట్టినపుడు గరటయ్యకు  పౌరుషం వచ్చింది. జడ్జీగారు శిక్ష వేసినపుడు పట్టుదల వచ్చింది. అంతే, పదేళ్ళు తిరక్కుండానే ఏపీలో ఓ అరడజను, పొరుగురాష్ట్రాల్లో మరో అరడజను మినీ స్టీలు ప్లాంటులు కట్టేసి, మినీ లక్ష్మీమిట్టల్ గా అవతరించాడు గరటయ్య.

పేదరికంలో మనుషులకు కులమతాలు వుండవు.  వుండవంటే వుండవనీకాదు. అలా మన్ను తిన్న వానపాములా ఓ పక్కన పడివుంటాయి.  మనుషులకు డబ్బు వచ్చేకొద్దీ కులా, మతాలకు మంచి ఎరువుపడి, వానపాములు కాస్తా త్రాచుపాములుగా మారి బుసలు కొడుతాయి. అలా డబ్బు సంపాదించే క్రమంలో గరటయ్య ఓ రోజు గరటయ్య నాయుడు అయిపోయాడు. అతని వ్యాపార సంస్థ ’జీయన్’ గా మారిపోయింది. ’జీయన్’ అంటే షేర్ మార్కెట్లో అదో ఇది.           

దొంగ సొత్తు త్వరగా పోతుందని పాతకాలంవాళ్ళు అంటారుగానీ, ఇప్పుడు దేశంలో, కాలుష్యంకన్నా, దొంగసొత్తే వేగంగా పెరిగిపోతోంది. కార్పొరేట్ దిగ్గజంగా మారేక గరటయ్యనాయుడు విశ్వరూపం ప్రదర్శించాడు.  అంటే, వ్యాపారంలో ప్రపంచ ఆటగాళ్లతో జట్టుకట్టాడు. గత ప్రభుత్వ హయాంలో రెండు గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్టులు, అంతకుముందున్న ప్రభుత్వంలో రెండు ధర్మల్ పవర్ ప్రాజెక్టులు తన ఖాతాలో వేసుకున్నాడు.  నాయుడి పేరుతోనో, నాయుడి బినామీల పేరుతోనో, రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులు, సెజ్జులు చెరో అరడజను వెలిశాయి.

మార్కెట్లోకి కొత్తగా దిగే లగ్జరీ మోడలు కార్లన్నీ తన గ్యారేజీలో హాజరు వేయించుకోవాలనిన్నూ, శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగే  సెలబ్రెటీలందరూ ఒక పూటైనా తన ఆతిథ్యం స్వీకరించాలనిన్నూ, గరటయ్యనాయుడు ఓ జీవో జారీ చేశాడు. జీవో అనగా ’గవర్నమెంటు ఆర్డరు’ అనిగాక, "గరటయ్యనాయుడి ఆజ్ఞ" అన్ని కొన్ని పత్రికలు తెలుగులో తర్జుమా కూడా చేశాయి.

తన అరచేతిలో ధన రేఖను గీసిన కోర్టువారన్నా, తన నెత్తి మీద లక్ష్మీకటాక్షాన్ని కురిపించిన పోలీసువారన్నా గరటయ్యనాయుడుకు చాలా గౌరవం. గరటయ్యనాయుడి ఆతిథ్యం స్వీకరించేవారిలో, ముందు పోలీసు అధికారులే వుండేవారు. ఆ తరువాత అతిథుల పరిధి పెరిగింది. మంత్రులు, సినిమా హీరోలు, క్రికెటర్లు, మీడియా టైకూన్లు చేరారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులకు కూడా అతిథుల జాబితాలో చోటు కల్పించాడు గరటయ్యనాయుడు.

సరిగ్గా ఈ సమయంలోనే గరటయ్య నాయుడి కథ మలుపు తిరిగింది. ప్రభుత్వాధినేతలతో గరటయ్యనాయుడు పనులు చేయుంచుకునేవాడేతప్ప, ఎవరితోనూ, ఎప్పుడూ మరీ పూసుకు తిరిగేవాడుకాదు. మనిషి ఎదగాలంటే, కుర్చీ ప్రధానం, కుర్చీలో కూర్చున్నవాడు అప్రధానం అనేది అతని పాలసీ. కానీ, గత ప్రభుత్వంలో అతను ఒకే ఒకసారి పాలసీ తప్పాడు. గత సీయం రాష్ట్రాన్ని కనీసం ఇరవై యేళ్ళు ఏలుతాడని నమ్మేశాడు.  ఆ సీయంను భుజాలమీదేకాక ఏకంగా నెత్తిమీదే పెట్టేసుకున్నాడు. కానీ, ప్రభుత్వం పడిపోతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను అనుకోనిది జరిగిపోయింది.
          
కొత్త ప్రభుత్వం గరటయ్యను బధ్ధశత్రువుగా భావించింది. గత సీయం మీదున్న కసినంతా, గరటయన్నాయుడి మీద తీర్చుకోవాలనుకుంది. అలా అనుకోవడమే తరువాయి, సిబీ‌ఐ చురుగ్గా కదిలింది. ముఫ్ఫయేళ్ళుగా గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్ళను బయటికి తీసి, వాటి బూజు కూడా దులపకుండా గరటయ్య నాయుడి నెత్తిన పడేసింది.

మనిషి మహత్తర విజయం సాధించడానికి ఒక్క మలుపు చాలు. మనిషి పతనాన్ని శాసించడానికి ఒక్క తప్పు చాలు.

ఫ్లాష్ బ్యాక్  ను వదిలేసి మల్లా వర్తమానానికి వచ్చేస్తే, ఆలా హైకోర్టు బోనులో నిలబడ్డాడు. ఆ షాకు నుంచి అందరికన్నా ముందుగా తేరుకుని ఆత్మపరిశీలన చేసుకున్నది ప్రధాన న్యామూర్తులంవారే. "జీయన్ సంస్థలో నాకు లక్షన్నర షేర్లున్నాయి. కనుక ఈ కేసును నేను విచారించడం సమంజసం కాదు. నాట్ బిఫోర్ మీ" అంటూ ఓక ప్రకటన చేసి, ధర్మాసనం దిగి, గౌను సర్దుకుంటూ, చకచకా వెళ్ళిపోయారువారు.

గరటయ్య నాయుడు జీవితంలో ప్రతి మెట్టులోనూ కోర్టు వాజ్యాలు ఎదుర్కొన్నాడు. ఏ కేసునూ అతను ఆషామాషీగా తీసుకోలేదు. ప్రతిదానికీ పెద్ద లాయర్లనే పెట్టాడు. విజయాలు సాధించాడు.  ఆ పెద్ద లాయర్లంతా ఇప్పుడు  న్యాయమూర్తులయ్యారు. అదియునూకాక, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ గరటయ్య నాయుడు, తనవైన సేవలు అందించాడు. హైకోర్టు న్యాయమూర్తుల్లో, ఎక్కువమంది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రాజకీయపార్టి సిఫారసుతో నియమితులైనవాళ్ళే. అదలావుంచినా, ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లాయర్లలో చాలా మంది, ప్రస్తుత న్యాయమూర్తుల వద్ద ఒకప్పుడు జూనియర్లుగా పనిచేసినవారే.   

మనం అంతగా గమనించంగానీ, ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఘరానా దొంగలు, పెద్ద పోలీసు ఆఫీసర్లూ, పేరుమోసిన న్యాయవాదులూ, ప్రధాన రాజకీయపార్టీల నాయకులు, తీర్పు చెప్పే న్యాయమూర్తులూ అంతా ఒకే సామాజికవర్గానికి చెందివుంటారు.  లేకుంటే, ఒకే ఆర్ధికవర్గానికి చెందివుంటారు. సమాజాన్ని యేలేవాళ్ళే సాధారణంగా న్యాయస్థానాల్నీ ఏలుతారు.

కోర్టులో అందరూ ఒకసారి ఒకరిముఖాలు ఓకరు చూసుకున్నారు.  ధర్మాసనం మీది న్యాయమూర్తులకూ, ధర్మాసనం కింది న్యాయవాదులకూ, బోనులో నిలబడ్డ నిందితునికీ మధ్య ఎదో కనిపించని నూలుపోగు సంబంధం వుందని అందరికీ హఠాత్తుగా తెలిసివచ్చింది. అలా తోచిందే తడవుగా, న్యాయమూర్తులందరూ ధర్మాసనం దిగి, గౌన్లు సర్దుకుంటూ వెళ్ళి పొయారు. ఆ వెనుక న్యాయవాదులు కూడా కోర్టు హాలు వదిలి వెళ్ళిపోయారు.


ఈ పరిణామాల్ని చూసి, గరటయ్య నాయుడు ఖిన్నుడయ్యాడు.  "కడిగిన ముత్యంలా, సానబెట్టిన వజ్రంలా బయటికి వస్తాను" అని అతను భీకర ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. ముప్పయి యేళ్ళుగా  న్యాయస్థానం మీద అతను పెంచుకున్న నమ్మకం అలాంటిది. "నన్ను వదిలి వెళ్లవద్దు" అని అతను అందర్నీ బతిమాలుకున్నాడు. ఎవ్వరూ అతని మాటల్ని వినలేదు.  దానితో గరటయ్యనాయుడిలో పౌరుషం పెల్లుబికింది. "నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు ఈ నిందితుడి బోనులో నుండి కదలనుగాక కదలను" అని అతను ఇంకో శపథం చేశాడు. 

హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచీలు, డివిజన్ బెంచీలు, ఫుల్ బెంచీలు,  హాఫ్ బెంచీలు,  క్వార్టర్ బెంచీలు అంటూ అనేక ధర్మాసనాలుంటాయి. ధర్మాసనం అన్నాక న్యాయమూర్తులుంటారు. న్యాయమూర్తుల్లో తప్పనిసరిగా మనుషులు వుంటారు. మనుషులన్నాక కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతీ-సాంప్రదాయాలు, వాణిజ్య-వ్యాపార ఆసక్తులు అన్నీ వుంటాయి.

అయితే, వాళ్ళందరికీ గరటయ్యనాయుడితో, నేరుగా సంబంధాలున్నాయని అనడమూ తప్పే. గరటయ్యనాయుడితో మానవ సంబంధాలులేనివాళ్ళు  హైకోర్టులో చాలామందే వున్నారు.   ముచ్చటపడి జీయన్ సంస్థలో షేర్లు కొనుక్కున్న కారణాన వాళ్లకు అతనితో మార్కెట్  అనుబంధం మాత్రమే  వుంది. ఏదైనా సంబంధం సంబంధమేకదా! భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే.   
హైకోర్టులోని బెంచీలన్నీ గరటయ్యనాయుడి కేసును విచారించడానికి తిరస్కరించడంతో, నాయుడి మనస్సు చివుక్కుమంది.  అతను, ఆ విస్తృత ధర్మాసనం ముందున్న బోనులో దాదాపు ఇరవై నాలుగు గంటలు తిండీతిప్పలులేక అలా నిలబడిపోయాడు.

నిందితుడు బోనులోనూ, న్యాయమూర్తులు ధర్మాసనం బయటనూ వుండిఫోవడంతో న్యాయవ్యవస్ద్థలోనే  సరికొత్త సంక్షోభం తలెత్తింది. పరిస్థితిని చక్కదిద్దడానికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హుటాహుటిన రాష్ట్రపతి భవనానికి చేరుకున్నారు.  దేశంలోని న్యాయవేత్తలందరితో, అర్ధరాత్రి వరకు మేధోమధనం సాగించిన రాష్ట్రపతి, చివరాఖరికి నాయుడి సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు.

"ఈ కేసు, ఈ దేశపు ధర్మాసనాలు విచారించదగినదికాదు. ధర్మాసనాల పరిధిలోనికిరాని నేరాలేవీ నేరాలు కావు. ప్రస్తుతం అమల్లో వున్న చట్టాల ప్రకారం గరటయ్య నాయుడు సంపూర్ణ నిర్దోషి. అతను నిందితుల బోనును వదిలిపెట్టి, స్వేఛ్ఛగా ఇంటికి వెళ్ళిపోవచ్చు" అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ వారు మరునాడు ఒక అధికార ప్రకటన చేశారు.

హైకోర్టు రిజిస్ట్రారువారి ప్రకటన అసలు ప్రతిని అందుకున్నాక మాత్రమే, గరటయ్య నాయుడు సగర్వంగా  తల ఎగిరేసి, బోను వదిలి బయటను నడిచాడు.

హైదరాబాద్
 5 May 2013

Sunday 1 February 2015

అభిజాతాలు

అభిజాతాలు
ఉషా యస్ డానీ

వాళ్ళిద్దరు.
బాబూ, శీనూ – అప్పూ, చిరుకొండడుల్లా.
వాళ్లను చూసి ఆర్నేల్లయింది.
ఆ కళ్ళలో ఎంత ఆత్మ విశ్వాసం!
ఆ నాలుగు కళ్ళు నన్నుఆర్నెల్లుగా వెంబడిస్తూనే వున్నాయి.
గుచ్చిగుచ్చి ప్రశ్నలవర్షం కురిపిస్తూనే వున్నాయి.

సాయంత్రం కాలేజీ నుండి తిరిగి వచ్చాక చూశానా ఉత్తరాన్ని. ఎవరో ఖైదీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి రాశాడు.
ఉత్తరం నిండా అవేకళ్ళు. అవే చూపులు. అవే ప్రశ్నలు.
వాళ్ళిద్దరూ నా శిష్యులు. నేను వాళ్లకు గురువును అవునోకాదో నాకు తెలీదు. అయినా వాళ్ళు నా శిష్యులు. అవును నా శిష్యులు.
నేను పక్కూరి హైస్కూలులో పనిచేసినపుడు అక్కడే వాళ్ళు టెన్త్ చదివేరు. నేను కరీంనగర్ కాలేజీలో  లెక్చరర్ గా మారేక ఇక్కడే వాళ్ళు ఇంటర్ లో చేరేరు.
చిరస్మరణ నవల చదివి ఐదేళ్లయింది. వాళ్ళ ప్రస్తావన వచినప్పుడెల్లా అప్పూ, చిరుకొండడ్లే నా కళ్ళ ముందు కదలాడుతుంటారు. నాకు ఆ  నవల తెచి ఇచ్చింది వాళ్ళే. దాని మీద ఏదో వాళ్ళ విద్యార్ధి సంఘం లైబ్రరీ ముద్ర వుంది. అది చూసి ఆ పుస్తకాన్ని గిరవేవాటేశాను.
అప్పట్లో నేను శాఖలో వుండేవాడ్ని.  వాళ్ల విద్యార్ధి సంఘానికీ మాకూ చుక్కెదురు. అలాగని వాళ్ళిద్దరితో సంబంధాన్ని తెంచుకోలేదు. అది నా వల్ల కాలేదు. దానికి కారణం మా ఆవిడ.
వాళ్ళిద్దరిదీ మా ఆవిడదీ ఒకే ఊరు. వాళ్ల అక్కాచెల్లెళ్ళు మా ఆవిడకి చిన్ననాటి స్నేహితురాళ్ళు. దాంతో ఆమె వాళ్లని అరేయ్ తురేయ్ అని పిలిచేది.  రానురానూ ఈ పట్నంలో మా ఆవిడ వాళ్లకు సొంత అక్కయుపోయింది. మా పిల్లలకు జలుబుచేసి ఆసుపత్రికి తీసుకెళ్ళినా వాళ్ళే, చివరకు మా ఆవిడ ఆపరేషను చేయుంచుకుని హాస్పిటల్ లో వున్నా వాళ్ళే.
వాళ్ళ ప్రపంచం వేఋ. అది నాకు నచ్చేదికాదు.  నా బలహీనత ఏమిటోఅర్ధంకాదు. ఎందుకో వాళ్లను మినహాయించి మా ఇంటిని ఊహించడం నాకే సాధ్యం అయ్యేదికాదు. వాళ్ల ఎప్రోచ్ లోనే ఏదో ఓ మహత్యం వుంది. దాన్ని ఎదిరించలేకపోయా. లొంగిపోయా. చివరకు చిరస్మరణ చదవక తప్పలేదు.
అందులో మాస్టారు పాత్రను చదువుతుంటే ఒళ్లంతా చీమలు కుట్టినట్టుగా వుండేది. నాలా హాయిగా ఉద్యోగం చేసుకోక ఇదేం పాడు జబ్బు అనిపించేది.
లోకంలో మనం గొప్ప పనులు చెయ్యకపోయినా ఇబ్బందేమీ వుండదు. కానీ, మనలాంటోడు గొప్పగొప్ప పనులు చేసేస్తుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది.
నవల చదివేక ఇక ఆ రాత్రి నిద్రపడితే ఒట్టు. ఒళ్లంతా ఉక్కబోసేసినట్టు అయిపోయింది. ఎవరిదో పరాయి శరీరంలో నేను బతికేస్తున్నానేమో అనిపించింది. మూడు రోజులు మామూలు మనిషి కాలేకపోయా. దాని ప్రభావం ఇంతా అంతాకాదు. అదంతా చివరకు వీళ్ళిద్దర్నీ అభిమానించడంగా మారిందని  చాలా ఆలస్యంగా అర్ధం అయింది.

ఏడు నెలల క్రితం వాళ్లను అరెస్టు చేశారు. పట్టపగలు నడిరోడ్డు మీద. చాలా మంది చూశారు. అలా చూసినవాళ్లకు కళ్ళుండవని పోలీసుల నమ్మకం. ఎందుకోగానీ పోలీసుల నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయలేదు.
రెండు రోజుల తరువాత వాళ్ల అరెస్టు వార్త నాకు తెలిసింది. తెలిసినా నేను చెయ్యగలిగిందేమీ లేదు. శాఖ వున్న రోజుల్లో పోలీసు స్టేషన్లో కాస్త పరపతి వుండేది. అప్పటి పరిస్థితి వేరు. మరి ఇప్పుడో వాళ్లను చూడడానికి పోలీసు స్టేషనుకు వెళ్లడం అంటే కోరికోరి చావును కొనితెచుకోవడమే. నాకా తెగువ లేదు.
వాళ్ల తల్లిదండ్రులు స్టేషనుకు వెళ్ళేరట. వాళ్లనూ తన్ని తగలేసి వారం రోజులు లాకప్పులో వుంచారట.
నెల రోజుల తరువాత అనుకుమ్టాను ఎవర్నో హత్య చేసినట్టూ, మరింకెవరి ఇంట్లోనో దొంగతనం చేసినట్టూ తప్పుడు కేసులుపెట్టి సబ్ జైలుకు పంపేరు.
సబ్ జైలు గుడ్డిలో మెల్ల కనుక ధైర్యం చేసి వెళ్ళి కలుసుకున్నా. జైల్లో ప్రవేశించగానే ఎందుకో ప్రాణం ఝల్లుమంది. ఏవేవో అడగాలనుకున్నా. నోరు పెగల్లేదు. వాళ్ళిద్దరూ కటకటాల్లోపల శవాల్లా పడున్నారు. శరీరాలు నల్లగా కమిలిపోయింది. లాఠీదెబ్బలు పెద్దపులి చారల్లా చర్మంపై అతుక్కుపోయాయి. చారల మధ్య పుళ్లయి నెత్తురు కారుతోంది. అట్టకడుతున్న నెత్తుటి మీద ఈగలు వాలుతున్నాయి. 
నేను వచ్చినట్టు గమనించి ఎవరో వాళ్లను తట్టిలేపారు. వాళ్ళళో కదలిక లేదు.  నిదానంగా కళ్ళు తెరిచారు.
ఎంత ఆశ్చర్యం. ఆ కళ్లళ్ళో ఎక్కడా దీనత్వంలేదు. అవి ఎంత స్వఛ్ఛంగా నిర్మలంగా వున్నాయనీ!  వాళ్ళకూ తెలుసు ఇలాంటిది ఎప్పుడో ఒకప్పుడు తప్పదని. వాళ్ల దేహాలు ఆ బాధను తట్టుకోలేక గిలగిల లాడాయేమోగానీ, వాళ్ళ విశ్వాసం చెదరలేదు. అందుకు ఆ నాలుగు కళ్ళే సాక్ష్యం.
వాళ్ళు లేచి కటకటాల దగ్గరకు వచ్చారు. నా ఆలస్యానికి క్షమాపణలు కోరుకోవాలనుకున్నా. అప్పటికీ నోరు పెగలలేదు. ఏదో చెప్పబోయి తలదించుకున్నాను. వాళ్ళు అంతా పసికట్టేసినట్టున్నారు. వాళ్లకంతా అర్ధం అయిపోయినట్టుంది. ఒక సన్నని చిరునవ్వు నవ్వేరు. నాకు అప్పుడే మొదటిసారిగా తోచింది వాళ్ళు నాకన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారనీ.
శీను మా ఆవిడ గురించీ మా పిల్లల గురించీ అడిగేడు. బాబు వాడి పక్కని నిలబడి వింటున్నాడు. నేను వాళ్లను పరామర్శించడానికి వెళ్ళానో  వాళ్ళు నన్ను పరామర్శిస్తున్నారో కాస్సేపు అర్ధం కాలేదు.
శిష్యుల్ని చూడ్డానికికదా నేను వెళ్ళిందీ?  నా స్నేహితుల్ని కలిసినట్టుగా వుండింది. ఆత్మీయుల్ని చూసినట్టుగా వుండింది.  నాలోని ఉపాధ్యాయుడు కరిగిపోయి వాళ్ళ శిష్యుడిగా మారిపోతున్నట్టు అనిపించింది.
చివరకు ధైర్యం చేసి  సమాధానం తెలిసిన ప్రశ్నే అడిగాను; కొట్టేరా? అని.
దాందేముందిలెండి. ,మామూలే అన్నాడు శ్రీను.
మేమేమీ తక్కువ తినలేదు మాస్టారూ! అన్నాడు బాబు ఉత్సాహంగా. అతని కళ్ళల్లో మెరుపు మరింత తళతళ లాడింది.
ఏం చేసేరేంటీ?
చంద్రన్న జాడ చెప్పమన్నారు. సరే చూపెడతాం అని ఓ రాత్రేళ తీసుకుని వెళ్ళాం. అన్నడు శ్రీను.
ఎక్కడికి అనుకున్నారూ? సమాధానం ఆశించకుండానే అడిగాడు బాబు. అతని కళ్ళు వ్యంగ్యంగా మెరిసేయి.
వరంగల్ సిధ్ధిపేట రోడ్డులో హుస్నాబాద్ ఇవతల రత్నగిరి కొండలు లేవూ? అక్కడికి! తార్రోడెంట కాదు; అడ్డదారుల్లో తీసుకువెళ్ళేం.  ఈ రాత్రంతా ఆ కొండల్లో, గుట్టల్లో, తెగతిప్పేం వాళ్ళని. తాగేసున్నారు. అప్పుడు తెలియలేదు. తెల్లారే సరికి ఒళ్లంతా గీరుకుపోయింది వెధవలకి. అన్నాడు శ్రీను.
చేన్ల కావలికి మంచెకాడ పట్టుకున్న లాంతర్లను దూరం నుండి చూసి తెగ భయపడిపోయారు నాయాళ్ళు. ఓ ఐదొందల మంది కాగడాలు పట్టుకుని దాడికి వచ్చేస్తున్నారనుకుని బిక్కచచ్చిపోయారు. ఇక పరుగే పరుగు నవ్వుతూ చెప్పుకుపోయాడు బాబు. 
తెల్లారేసరికి పోలీసు స్టేషన్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డుగా మారిపోయింది. కానిస్టేబుళ్ల దగ్గరి నుండి డీయస్పీ వరకు అందరికీ ఒంటి నిండా బ్యాండేజీలే  అన్నాడు శ్రీను.
మిమ్మల్ని మళ్ళీ కొట్టారేమో?
కొట్టారనుకోండీ. అయినా వాళ్ళు మనకు పది ట్రీట్ మెంట్లు ఇస్తే మనం ఒక్కటయినా ఇవ్వకపోతే ఏం బాగుంటుందీ? ఇచ్చేసేం. అంతే! బాబు చెపుతుంటే శీను నవ్వుతూ నిలబడ్డాడు.
లేకపోతే తన్నేసేరని చంద్రన్న జాడ చెప్పేస్తామా మాస్టారూ?
శీను మాటల్లో వ్యంగ్యంకన్నా ఆ సమయంలోనూ శత్రువును ముప్పుతిప్పలు పెట్టగలిగామనే సంతృప్తే వుంది. ఆధోరణే నన్ను మరింత ఆకట్టుకుంది.
ఆ తరువాత వాళ్లను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేసేరు.
వాళ్ళు నా శిష్యులు. నా మీద వాళ్ళు  చూపే అమిత గౌరవం ఇబ్బందిగా వుంటుంది.  వాళ్ళ చూపుల వెనుక ఎక్కడో ఒక సందేహం కనిపిస్తూ వుంటుంది; మీరు మాకు గురువే కదా? అని. గురువునని చెప్పాలనే నా తాపత్రయం కూడా. శిష్యులకేం కరువూ? ఉపాధ్యాయ వృత్తిలో బోలెడుమంది దొరుకుతారు. కానీ అలాంటి శిష్యులు దొరకడం నిజంగా ఓ వరం. నాకొచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకో దలచలేదు. చివరకు వాళ్ల గురువుగా ఎదగదలచుకున్నా.
మనిషిగా ఎదగడం వయసులో ఎదిగినంత, చదువులో ఎదిగినంత సులువుకాదు.
నేను వాళ్ల గురువుగా ఎదగడానికి ప్రయత్నం చేసేకొద్దీ నా పాత స్నేహితులు దూరం అయిపోయారు. కొందరు ముఖం మీదే తిట్టేరు. కొందరు అయ్యోపాపం అన్నారు. కొందరు బంగారంలాంటి జీవితాన్ని పాడుచేసుకోకు అన్నారు. కాలేజీ కరస్పాండెంట్ సస్పెండ్ హెచ్చరికలు చేశాడు. అంతెందుకూ శీనూ, బాబుల్ని అంతగా అభిమానించిన మా ఆవిడ వారం క్రితం మా పెడ్డాడ్ని నా ముందే చావ బాదింది.  వాడి ప్యాంటు మీద జేగురు రంగు మరకలు వున్నాయట. వాల్ రైటింగుకు వెళ్ళినట్టు పసిగట్టింది.
మరోసారి మరోసారీ.
పదోసారి ఆ ఉత్తరం చదివా.
జైలు మాన్యువల్ ను అమలు చేయాలనీ, కనీస సౌకర్యాలు కల్పించాలనీ ఖైదీలు సమ్మె చేశారట. శ్రీను, బాబు పదిరోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారట.  వాళ్లను లేపెయ్యడానికి వార్డెన్లు లాఠీచార్జి చేశారట. స్పృహతప్పి పడిపోతే ఇద్దర్నీ హాస్పిటల్ లో చేర్పించారట. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందట.
ఉత్తరం చదివిన దగ్గర నుండి మా ఆవిడ ఒకటే ఏడుపు. ఏమిటో ఈ జీవిత ద్వంద్వం. ఆదర్శాలకూ బతుకుతెరువుకూ మధ్య ఓ చెలగాటం.
వాళ్లను బతికించుకోవాలి. వాళ్ళు నన్ను చూసే చూపుల వెనక దాగున్న సందేహానికి అభయం ఇవ్వాలి. ఒక్కసారి వాళ్ల ముందు నిలబడి నిజంగా నేను మీ గురువునే అనగలగాలి.
వాళ్ల వూరు వెళ్ళి, వాళ్ళ తలిదండ్రుల్ని తీసుకుని వెంటనే రాజమండ్రి వెళ్ళాలనుకున్నా. వెంటనే బయలుదేరమంటూ మా ఆవిడ ఒకటే తొందర పెడుతోంది. పెద్దాడ్ని పిలిచి, అప్పుడు వద్దాన్నా వెళ్ళావు కదరా. అదేదో వాల్ రైటింగులు ఇవ్వాళ రాయరాదూ? అంది.
ఇవ్వాళ నాకు ప్రపంచాన్ని జయించినంత గర్వంగా వుంది.  ప్రపంచాన్ని జయించడం అంటే మనిషి తనను తాను జయించడమే అని నాకు ఇవ్వాళే తెలిసింది.
గబగబా వీధిలోకొచ్చి బస్ స్టేషన్ దారి పట్టాను.
కాకూడనిదేదో జరిగితే వాళ్ల ప్రయాణన్ని నేను కొనసాగిస్తా. కాదుకాదూ, వాళ్ళతో నేను నడుస్తా.
కొండంత ఆశ. లోయంత భయం.
వాళ్ళు తప్పక బతుకుతారు. ఔను తప్పక బతుకుతారు. ఎలా చెప్పగలనంటే చిరుకొండడూ, అప్పూ చిరంజీవులుకదా!
--- // --
సెప్టెంబరు, 1987
      (రచయిత బీయస్ రాములు 1987లో పంచుకున్న ఒక అనుభవాన్ని నేను సమీక్ష మాసపత్రిక కోసం కథగా మలిచాను. తెలంగాణ సాంప్రదాయంలో లేనందువల్ల నా కథన శైలి రాములుకు నచ్చలేదు. తను ఇదే శీర్షికతో తిరగరాసిన మరో వెర్షన్ ను  సమీక్షలో ప్రచురించాము. నా వెర్షన్ అముద్రితంగా వుండిపోయింది. అంచేత దీన్ని కథ బీయస్ రాములు, కథనం డానీ అనుకుంటే సమంజసంగా వుంటుంది.)